ఎవరెవరిని అసమర్దులు అనవచ్చు?
ఏ సమయములో అసమర్థులు అవుతారు?
ఒక్కసారి మన పురాణాలల్లోకి వెళ్ళితే
భార్య కోరిక మన్నించిన దశరథుడు అసమర్థుడా లేక తండ్రిమాట జవదాటని రాముడు అసమర్థుడా?
సీతని పోగొట్టుకున్న రాముడు అసమర్థుడ లేక లక్ష్మణగీత దాటినా సీత అసమర్థురాల?
గ్రుడ్డివాడు ఐన దృతరాష్త్రుడు అసమర్థుడా లేక భర్త మీద ప్రేమతో కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి అసమర్థురాల?
విలువిద్యలో ఆరితేరిన కర్ణుడు అసమర్థుడా లేక అతనిని ధర్మము వైపు నడిపించలేకపోయిన కుంతి అసమర్థురాల?
ఇచ్చినమాట తప్పకపోవడము రాజు గుణము, మాట ఇచ్చాడు కదా అని ఏదైనా అడగవచ్చు అనే స్వార్ధచింతన చేసిన కైకేయి ఒకరకంగా అసమర్ధురాలు, చెప్పుడు మాటలు విని తనకి తన కొడుకులకి దశరథుడిని దూరము చేసిన కైకేయి అసమర్ధురాలు. ఒక్క క్షణము స్వార్ధచింతన ధరిచేరనీయకుండా నలుగురు కుమారులు నావారే అని అనుకుని ఉండి ఉంటె నేడు రామాయణము అనే ఒక మహా కావ్యము మనకి ఉండేది కాదు. అలానే మనిషిలో ఏ గుణాలు ఉండాలి ఏవి ఉండకూడదు అని మనకు తెలిసేది కాదు. ఆ కోణములో ఆలోచించినప్పుడు మన అందరికీ మనిషి జీవితము ఎలా గడపాలి అనే ఒక కావ్యమును అందించిన సమర్ధురాలు
కైకేయి.
లక్ష్మణ గీత దాటి ఒక భార్య తప్పు చేసినా, ఆ తప్పును ఎంచక తనను తిరిగి తన దరికి చేర్చుకోడానికి వానరుల సహాయముతో వెనుకడుగేయక సీతని అయోధ్యకి తీసుకుని వచ్చి ఒక భార్య పట్ల భర్త కర్తవ్యము భోదింపచేసిన ఆ ఇద్దరూ మహనీయులే. (సమర్దులే)
అలానే ఆనాడు గాంధారి కనుక కళ్ళకు గంతలు కట్టుకోకుండా తన భర్తని తన నూరుగురు కుమారులను ధర్మపథములో నడిపించి ఉంటె మనకు నేడు మాహాభారతము అనే మరో మహాకావ్యముకూడా ఉండేది కాదు. ఒక భర్త అజ్ఞానము తో గ్రుడ్డివాడు అయినప్పుడు భార్య ఏవిధముగా వ్యవహరించాలో ఆమె చెప్పకనే చెప్పినది.
అలానే ఒక తల్లి తన కొడుకుని అధర్మము వైపు నడిపిస్తే చివరకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందో చూయించింది కుంతి. అలా చూచినప్పుడు ఒక తల్లి, ఒక భార్య ఉత్తమమైన జీవితము జీవించడములో ఎంత కీలకమో మనకు తెలియపర్చిన వీళ్ళు ఇద్దరు మహానీయులే (సమర్దులే).
కాబట్టి మనము చూసే దానిపైన మనము ఆచరించే దానిపైన మనము వ్యవహరించే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది.
మొదటి రకము అసమర్ధులు :-
ఎదో ఒక సంఘటన జరగగానే పూనకము వచ్చినట్లు ఊగిపోయి అది చేస్తాము ఇది చేస్తాము అని వట్టి మాటలు చెప్పి సమాజములో ఒకరకమైన అశాంతిని, అభద్రతా భావాన్నీ కలుగచేసి ఆ తర్వాత నిమ్మకు నీరెత్తనట్టు ఉండిపోతారు. తరువాత అలాంటి సంఘటనే తన పక్క వీధిలో లేదా తన పక్క ఇంటిలో జరుగుతున్నపుడు కనీసము ఆపే ప్రయత్నము కూడా చేయరు. వీరి ఎవ్వరికి మన చరిత్రపట్ల మన సంస్కృతిపట్ల తెలుసుకోవాలి అనే కుతూహలతా ఉండదు. కేవలము సంఘటనల్ని ఆధారము చేసుకుని సమాజములో తమ స్థిరత్వాన్ని చాటుకోవాలి అనుకుంటారు. ఇలాంటి వారి ద్వారా సమాజానికి పెద్దగా ఉపోయోగము ఏమి ఉండదు. వీరు సమాజము ఎదుర్కునే విపత్కరపరిస్థుల్లాంటి వారు.
అలానే సమాజములో అన్నిరకాల విషయాలు జరుగుతుంటాయి ఉదాహరణకు దోపిడీలు, మానభంగాలు, హత్యలు మొదలగునవి. అయితే ఇలాంటి కార్యకలాపాలు చేసే వ్యక్తులు ఈ సమాజములో అన్ని మతాలలోనూ ఉంటారు. అది వారు పెరిగిన స్థితిగతులపైనా ఆధారపడి ఉంటుంది. మరి దీనిలో మనము ఆలోచించాల్సిన విషయము ఏమి ఉంటుంది? అక్కడే మన రెండవ మరియు మూడవ రకము అసమర్ధులు మనకు ఎదురుపడతారు.
రెండవ రకము అసమర్ధులు :-
ఇక్కడే అత్యంత ఉన్నత స్థితుల్లో పెరిగి, ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొనక చక్కని కుటుంబ పరిస్థితుల్లో పెరిగి పెద్దై సమాజము లో ఒక ఉన్నత స్థాయిని తమకంటూ ఏర్పరుచుకుని అసమర్దులుగా ఉండేవారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది.
వీరు ఎంతటి అసమర్ధులు అంటే వీరి కంటికి ఒక తెర అడ్డు పెట్టుకుని తమకి కావలసినప్పుడు ఆ తేరని అడ్డుతీస్తూ ఉంటారు. అది సమాజశ్రేయస్సు కొరకు అయితే మంచిదే కానీ సమాజములో విద్వేషంను పెంపొందించే ఉధ్యేశమే బాధకలిగించేది.
వీరు ఎప్పుడెప్పుడు తమ కళ్ళకు ఉన్న తెరను అడ్డు తీసి సమాజాన్ని జాగృత పరిచే ప్రయత్నము చేస్తారు అంటే, ఎక్కడో ఒక దగ్గర పొరపాటున ఒక ఇస్లాం మతస్థుడి పైన ఒక హిందూ మతస్థుడు లేదా కొంతమంది హిందూమతస్థులో దాడి చేస్తే వెంటనే బట్టలు చింపుకొని ఊరిమీద పడి అల్లకల్లోలం సృష్టిస్తారు. తమకు వచ్చిన బహుమతులు వెనక్కి ఇచ్చేస్తారు, ప్రభుత్వాన్ని తిడతారు, అంతర్జాతీయ మీడియా ముందర దేశాన్ని తిడతారు, తమకు ఇక్కడ రక్షణే కరువైంది అని అంటారు. అలాంటి సంఘటనలే ఇస్లాం మతస్థులు కొన్ని వేలల్లో హిందువులపైన జరిపినప్పుడు ఒక్కడు ముందుకు రాడు, అప్పుడు వీరికి యావత్ భారతదేశం శాంతి గా కనిపిస్తుంది. మహారాష్ట్రలో వందమంది మూకదాడి చేస్తే చనిపోయిన సాధువుల గురించి ఒక్కడు నోరువిప్పలేదు, బైంసా లో హిందూగృహాలు తగులపెట్టినప్పుడు ఒక్కడు మాట్లాడలేదు ఇవేవి వారికీ కనిపించలేదు.
మూడవ రకము అసమర్ధులు :-
ఇంకా వీరిగురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. ఆనాడు గాంధారి ఏవిధము గా అయితే కళ్ళకు గంతలు కట్టుకుని అజ్ఞానముతో ఉన్న భర్తని సరైన మార్గములో పెట్టె ప్రయత్నము చేయలేదో నేడు వీరు కూడా తమ కళ్లకు, కనిపించని గంతలు కట్టుకుని అజ్ఞానులకి వంతన పాడుతూ, కైకేయి వలే స్వార్ధ చింతనతో నా భరతమాతకి హాని తలపెట్టే పనిలో తల మునకలై ఉన్నారు. వీరిని వీరు సత్యాన్వేషకులు అని అనుకుంటారు కానీ చేసేది మాత్రము అంతా అసత్య ప్రచారమే. వీరికి TRP రేటింగ్ కావాలి, సమాజములో జరిగిన తప్పును ఒప్పు అని ఒప్పుని తప్పు అని చేసే మాయాజాలాలు వీళ్ళదగ్గర కోకొల్లలు. ఒక వర్గము పైన జరిగే దాడులని దర్పిణి వేసుకుని మరి చూసి కథలు కథలు గా సృష్టించి రాసి సమాజములో అశాంతి కలుగ చేస్తారు. అదే వర్గము కాషాయ వస్త్రదారుల పైన చేసే దాడులు వీళ్లకంటికి కనిపించవు. ఎందుకంటే అలాంటి వార్తలు రాసినా నేడు చదివే సమాజము లేదు కనుక.
వీళ్ళకి ఒక వర్గము పైన ఎంత ప్రేమ, ఆప్యాయత ఉంటాయి అంటే సుప్రీమ్ కోర్టు కూడా సింగల్ సోర్స్ అనవద్దు అంటే ఎక్కడ ఆ జమాతుల మనస్సు నొచ్చుకుంటుందో అని అలానే రాస్తాము అనే అంత. బైంసా లో హిందువుల ఇల్లు తగలబెట్టడము వీళ్ళకి కనిపించలేదు.
లాఠీ దెబ్బకు గుండెపోటుతో ఒక ముస్లిము మతస్థుడు మరణించడము కనిపించిన వీళ్లకు వందమంది మూకదాడి జరిపితే ప్రాణాలు కోల్పోయిన సాధువులు కనిపించలేదు.
నాల్గవ రకము అసమర్ధులు:-
దేశము ఏమైతే మనకేమి, నేనూ నా కుటుంబము బాగున్నాం కదా. నా కడుపు నేటికి నిండింది కదా అని అనుకునే మనము, ఇంకా లోతుకు వెళితే నేనూ నా కులము వాళ్ళము బాగున్నాము కదా. ఎక్కడో మహారాష్ట్రలో మరి ఎక్కడో కాశ్మీరులో లేదా ఎక్కడో నా ఇంటి వీధి చివరన జరిగిన అన్యాయపు సంఘటన నాకు ఎందుకు, నా ఇంటికి అయితే ఏమి కాలేదు కదా, నా కులము వాడికి ఏమి కాలేదు కదా అని నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అతి మంచి మనుషులము. మన నోటిద్వారా వచ్చే ప్రతి మాట నీతి మాటే కానీ ఆచరణ మాత్రము ఉండదు. సమాజము ఏమైపోతుందో అనుకుంటారు కానీ అదే సమాజము కొరకు నేను ఉన్న అంటూ అడుగు ముందుకువేయరు. వీరుడు రావాలి అంటారు కానీ నా ఇంటి నుండి అని అనుకోరు. జరిగే ఘోరాలు అన్నీ చూస్తాము ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసు చివరకు అన్ని మతాలూ సమానమే అన్ని వల్లెవేస్తాము. తప్పును తప్పు అని చెప్పే ధైర్యము ఉండదు కానీ ఎక్కడా తప్పు జరగవద్దు అనుకుంటాము.
"సమాజానికి అత్యంత చెడు చేస్తున్న అసమర్థులము మనమే. అసమర్ధులము అయిన మనము ఒక్కసారి కనుక మన చరిత్ర తెలుసుకుని మన ధర్మమూ, మన సంస్కృతి ఎంత గొప్పదో దేశానికీ, ప్రపంచానికీ కనుక చాటి చెప్పే ప్రయత్నము చేస్తే పైన చెప్పిన ముగ్గురు అసమర్ధులు తోక ముడిచి ఖచ్చితముగా ఈ ధర్మము గురించి పాటుపడుతారు".
"సమాజానికి అత్యంత చెడు చేస్తున్న అసమర్థులము మనమే. అసమర్ధులము అయిన మనము ఒక్కసారి కనుక మన చరిత్ర తెలుసుకుని మన ధర్మమూ, మన సంస్కృతి ఎంత గొప్పదో దేశానికీ, ప్రపంచానికీ కనుక చాటి చెప్పే ప్రయత్నము చేస్తే పైన చెప్పిన ముగ్గురు అసమర్ధులు తోక ముడిచి ఖచ్చితముగా ఈ ధర్మము గురించి పాటుపడుతారు".
భరతమాతకు జయమగు గాక...
తరిగొప్పుల రాజా రామన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్


Comments
Post a Comment