Skip to main content

Posts

Showing posts from April, 2020

నాయకుడు

క్రీ.పూ. 327 సంవత్సరం లో అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక కాంక్ష తో వివిధ దేశాలను జయిస్తూ భారతదేశం కూడా జయించాలి అనే ఆలోచన తో ఈ దేశం పైకి అడుగిడి ఇక్కడి స్వార్థపరులైన కొందరు రాజులని మచ్చిక చేసుకుని మరికొందరు వీరులైన రాజులని, భారతదేశ సైనికులని ముందునిలపెట్టి యుద్ధం చేయించి గెలిచి తన ఆధీనంలోకి తీసుకుని అలా ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఇక తనకు భారతదేశాన్ని జయించడం నల్లేరుపైన నడకే అని భ్రమిస్తూ ఉన్న సమయం లో....  అది తక్షశిలా విశ్వవిద్యాలయం. ఆ రోజుల్లో ప్రతి రాజ్యం లో మంత్రులుగా ఇక్కడ విద్యను అభ్యసించిన వారే ఉండేవారు. వీరంతా దేశము పైన ఎంతో అభిమానం కలిగి ఉండేవారు. కానీ స్వార్థపరులైన రాజుల ఆలోచనలకి ఏమిచేయలేక నిశ్చేస్తులై ఉండేవారు.  ఆ సమయంలో ఒక వ్యక్తి యావత్ భారతదేశాన్ని ఒక్కత్రాటి పైకి తీసుకుని వచ్చేవరకు నా సిగని ముడి వేయను అని ప్రతిజ్ఞభూని చంద్రగుప్తుని చేరదీసి అన్ని విద్యలూ నేర్పించి యాతని ద్వారా యావత్ భారతదేశాన్ని ఒక్కటి చేసి అలెగ్జాండర్ కలలను నిర్వీర్యం చేసిన మహా ఘనుడు, ఆచార్య విష్ణుగుప్తుడు అతనే మన చాణక్యుడు. అదే విధముగా ఒక్కసారి 16వ శతాబ్దానికి ...

ఎవరు అసమర్థులు? - Defaulter

అస్సలు అసమర్దులు అంటే ఏమిటి? ఎవరెవరిని అసమర్దులు అనవచ్చు? ఏ సమయములో అసమర్థులు అవుతారు?   ఒక్కసారి మన పురాణాలల్లోకి వెళ్ళితే భార్య కోరిక మన్నించిన దశరథుడు అసమర్థుడా లేక తండ్రిమాట జవదాటని రాముడు అసమర్థుడా? సీతని పోగొట్టుకున్న రాముడు అసమర్థుడ లేక లక్ష్మణగీత దాటినా సీత అసమర్థురాల? గ్రుడ్డివాడు ఐన దృతరాష్త్రుడు అసమర్థుడా లేక భర్త మీద ప్రేమతో కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి అసమర్థురాల? విలువిద్యలో ఆరితేరిన కర్ణుడు అసమర్థుడా లేక అతనిని ధర్మము వైపు నడిపించలేకపోయిన కుంతి అసమర్థురాల? ఇచ్చినమాట తప్పకపోవడము రాజు గుణము, మాట ఇచ్చాడు కదా అని ఏదైనా అడగవచ్చు అనే స్వార్ధచింతన చేసిన కైకేయి ఒకరకంగా అసమర్ధురాలు, చెప్పుడు మాటలు విని తనకి తన కొడుకులకి దశరథుడిని దూరము చేసిన కైకేయి అసమర్ధురాలు. ఒక్క క్షణము స్వార్ధచింతన ధరిచేరనీయకుండా  నలుగురు కుమారులు నావారే అని  అనుకుని  ఉండి ఉంటె నేడు రామాయణము అనే ఒక మహా కావ్యము మనకి ఉండేది కాదు. అలానే మనిషిలో ఏ గుణాలు ఉండాలి ఏవి ఉండకూడదు అని  మనకు తెలిసేది కాదు. ఆ కోణములో ఆలోచించినప్పుడు మన అందరికీ మనిషి జీవితము ఎలా...